: గంటాతో దాడి సీక్రెట్ భేటీ


తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోగా సరైన వేదికను ఎంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. అందుకేనేమో, నేడు రాష్ట్ర మౌలిక సదుపాయాల మంత్రి గంటా శ్రీనివాసరావుతో విశాఖలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ రహస్య సమావేశం వివరాలు బయటికి పొక్కకపోయినా.. దాడి చూపు కాంగ్రెస్ వైపేనన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. సమావేశం అనంతరం దాడి, గంటా చిరునవ్వులు రువ్వుతూ బయటికి రావడం వారి మధ్య 'ఒప్పందం' కుదిరిందన్న విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడిస్తోంది. ఇటీవలే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని దాడి టీడీపీ నాయకత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News