: ఇరాక్ లోని భారతీయుల్ని ఇరాక్ విమానాల్లో రప్పించే ఏర్పాట్లు


ఇరాక్ లో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇరాక్ లో నానాటికి పరిస్థితి మరింత దిగజారుతుండడంతో, అక్కడ ఉన్న భారతీయులను ఇరాక్ విమానాల్లోనే స్వదేశానికి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసింది. దీంతో ఈ రోజు రాత్రికి 200 మంది భారతీయులు, రేపు మూడు ఇరాక్ విమానాల్లో 1200 మంది భారతీయులు స్వదేశం చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు, ఏర్పాట్లను భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పర్యవేక్షించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News