: జెఎన్టీయూ(కె)లో ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ కోర్సుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్


అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాకోర్సును ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టేందుకు థాయ్ లాండ్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ థాయ్ లాండ్ ప్రతినిధులు ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సమావేశమై చర్చించారు. ఐదేళ్ల కాల పరిమితి గల ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ కోర్సుకు సంబంధించి ఈ సమావేశంలో తుది రూపునిచ్చారు. కాకినాడ జేఎన్టీయూలో ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు ఇచ్చారు. థాయ్ లాండ్ ప్రతినిధులు ఇచ్చిన ప్రతిపాదనలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కోర్సులో భాగంగా మూడున్నర సంవత్సరాలు కాకినాడ జేఎన్టీయూలోనూ... మరో ఏడాదిన్నర కోర్సును బ్యాంకాక్ లోనూ నిర్వహించేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News