: అతను ఇక్కడ కొరకడంతో... అక్కడ బిజినెస్ పెరిగింది!
ఉరూగ్వే ఫుట్ బాల్ స్టార్ లూయీ స్వారెజ్ జర్మనీ ఆటగాడిని కొరికితే కొరికాడు కానీ, బిజినెస్ మాత్రం అమాంతం పెంచేశాడు. చైనాలో ఫుట్ బాల్ కు ఎక్కువ మంది అభిమానులున్నారు. పీఫా వరల్డ్ కప్ ఫీవర్ కూడా బాగానే తలకెక్కించుకున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని లూయీ స్వారెజ్ పేరిట బాటిల్ ఓపెనర్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది ఓ కంపెనీ. అంతే, వాటికి ఆన్ లైన్లో సేల్సేసేల్సు! దీంతో టావోబావో వంటి చైనీస్ ఆన్ లైన్ సంస్థ తెగసంబరపడిపోతోంది. స్వారెజ్ కొరికితే కొరికాడు కానీ వ్యాపారం అమాంతం పెంచేశాడని హర్షం వ్యక్తం చేస్తోంది.