: శివసేన-బీజేపీ కలసి పోటీచేయడం శుభపరిణామం: లతా మంగేష్కర్
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు పలికిన ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ తన మనసులో మాటను బయటపెట్టారు. మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని తాను చూడాలనుకుంటున్నానని ఆమె చెప్పారు. ముంబయిలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో లతా మంగేష్కర్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కలసి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని కోరుకుంటున్నానని చెప్పారు.