: తెలంగాణలోని 6 జిల్లాల్లో ‘కారు’ జోరు


తెలంగాణలోని జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ‘కారు’ దూసుకెళ్లింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను టీఆర్ఎస్ చేజిక్కించుకుంది. నల్గొండ జెడ్పీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కోరం లేక రంగారెడ్డి జిల్లా జిల్లాపరిషత్ ఛైర్మన్ వాయిదా పడింది. హైకోర్టు స్టే విధించడంతో ఖమ్మం జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక నిలిచిపోయింది. తీవ్ర ఉత్కంఠ రేపిన వరంగల్ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. జిల్లాల వారీగా ఎన్నికైన జిల్లాపరిషత్ ఛైర్మన్లు: * ఆదిలాబాద్ - శోభారాణి (టీఆర్ఎస్) * మెదక్ - రాజమణి (టీఆర్ఎస్) * వరంగల్ - పద్మ (టీఆర్ఎస్) * నిజామాబాద్ - దఫేదార్ రాజు (టీఆర్ఎస్) * కరీంనగర్ - తులా ఉమా (టీఆర్ఎస్) * నల్గొండ - బాలూ నాయక్ ( కాంగ్రెస్) * మహబూబ్ నగర్ - బండారి భాస్కర్ (టీఆర్ఎస్)

  • Loading...

More Telugu News