: హూ యామ్ ఐ... మే కౌన్ హూ... నేను ఎవర్ని
అతనో అభినవ గజిని! 39 ఏళ్ల క్రితం ప్రమాదానికి గురై జ్ఞాపకశక్తి కోల్పోయాడు. 39 ఏళ్ల పాటు దేశదేశాలు తిరిగాడు. ఇన్నాళ్లకు సొంత ఊరు చేరుకోబోతున్నాడు. అచ్చం సినిమా కథలా ఉన్నా నిజమిది. వివరాల్లోకి వెళితే.. 1975లో సౌదీ అరేబియాలోని బురాయ్ దా పట్టణంలో ఇంట్లోంచి రోడ్డుపైకి వచ్చిన కుర్రాడు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పోయాడు. తానెవరో, ఎక్కడి వాడో మర్చిపోయాడు.
దీంతో కనిపించిన బస్సు ఎక్కాడు. దొరికిన రైలు పట్టుకున్నాడు. సౌదీ అరేబియా నుంచి ఇరాక్ వెళ్లాడు. అక్కడ్నుంచి ఇరాన్ వెళ్లాడు, అక్కడ్నుంచి పాకిస్థాన్ ఇలా నాలుగు దేశాలు తిరిగాడు. పాకిస్థాన్ లో పోలీసులు పట్టుకుని ఏడాది పాటు జైల్లో ఉంచారు. తరువాత అతని పరిస్థితి తెలుసుకుని వదిలేశారు.
అప్పట్నుంచి హూ యామ్ ఐ... మే కౌన్ హూ... నేను ఎవర్ని? అంటూ ఏ తల్లి ఏది పెడితే అది తిన్నాడు. అలా ఒకరోజు ఒక ఇంటికి వెళ్లాడు. అతని భాష సౌదీని పోలి ఉండడంతో ఆ మహిళ సౌదీ రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. వారు అతనిది సౌదీ అరేబియా అని తేల్చారు. దీంతో వారు అతనిని సౌదీకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.