: ఆంధ్రప్రదేశ్ లో జడ్పీ ఛైర్మన్ లు వీరే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఛైర్మన్ ల ఎన్నిక ముగిసింది. ఒక్క కడప జిల్లాలో మాత్రం జడ్పీ ఛైర్మన్ పదవిని వైకాపా కైవసం చేసుకుంది. మిగిలిన అన్ని జిల్లాల పీఠాన్ని టీడీపీ సొంతం చేసుకుంది. జిల్లాల వారీగా జడ్పీ ఛైర్మన్లు వీరే... * అనంతపురం - దూదేకుల చమన్ (టీడీపీ) * కర్నూలు - రాజశేఖర్ గౌడ్ (టీడీపీ) * కడప - గూడూరు రవి (వైకాపా) * చిత్తూరు - ఎస్. గీర్వాణి (టీడీపీ) * నెల్లూరు - ప్రతిష్ఠంభన నెలకొంది * ప్రకాశం - ప్రతిష్ఠంభన నెలకొంది * గుంటూరు - షేక్ జానీమూన్ (టీడీపీ) * కృష్ణా - గద్దె అనురాధ (టీడీపీ) * పశ్చిమగోదావరి - ముళ్లపూడి బాపిరాజు (టీడీపీ) * తూర్పుగోదావరి - నామన రాంబాబు (టీడీపీ) * విశాఖపట్నం - లాలం భవాని (టీడీపీ) * విజయనగరం - శోభా స్వాతిరాణి (టీడీపీ) * శ్రీకాకుళం - చౌదరి ధనలక్ష్మి (టీడీపీ)