: ఇక, ఇప్పుడు ఈఎన్ టీ భూముల వంతు
మొన్న గురుకుల్ ట్రస్ట్ భూములు, నిన్న గోకుల్ ఫ్లాట్స్... ఇక ఇప్పుడు ఈఎన్ టీ భూముల వంతు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈఎన్ టీ భూముల వ్యవహారంపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ అధికారులతో చర్చించారు. ఈఎన్ టీ భూముల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని కేసీఆర్ కు రెవెన్యూ అధికారులు చెప్పారు. ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన భూములను వెనక్కి తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.