: కాశ్మీర్లో ఎన్ కౌంటర్... మిలిటెంట్ హతం


జమ్మూకాశ్మీర్లో నేడు ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. కాశ్మీర్ దక్షిణప్రాంతంలోని పుల్వామా జిల్లా త్రాల్ వద్ద మిలిటెంట్లకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మిలిటెంట్ మరణించగా, ఓ జవాన్ గాయపడ్డాడు. మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు త్రాల్ ప్రాంతంలోని అరిపాల్ గ్రామం వద్ద గాలింపు జరుపుతుండగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది. మరణించిన మిలిటెంట్ వద్ద ఓ ఏకే-47 రైఫిల్ లభ్యమైంది.

  • Loading...

More Telugu News