: మహిళా నేతలు... మహారాణులే సుమీ...!


దర్పం ప్రదర్శించడంలో మహిళా నేతలు మగాళ్ల కంటే ముందుంటారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షత్ 31 ఏసీలు, 15 కూలర్లు, 25 రూం హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫయర్లు, 12 గీజర్లు వాడి తన స్థాయిని చాటారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి చెప్పులు తెప్పించుకునేందుకు ఖాళీ విమానాన్ని ముంబై పంపించి వివాదం రేపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆమె ఆభరణాలు తరలించేందుకు మూడు వ్యాన్లు వాడాల్సి వచ్చిందంటే ఊహించండి. ఆమె దగ్గర 700 జతల చెప్పులు ఉన్నాయంటే నమ్మాల్సిందే. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ విదేశీ పర్యటనల వ్యయం 205 కోట్ల రూపాయలు. 12 సార్లు 22 దేశాల్లో ఆమె పర్యటించగా, 169 కోట్ల రూపాయలు ఎయిరిండియాకు చెల్లించాల్సి వచ్చింది. అందుకే మహిళా నేతలా... మహారాణులా? అనాల్సి వస్తోంది!

  • Loading...

More Telugu News