: సీఎం సభకు 'ఛార్జిషీటు' సెగ
ప్రకాశం జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి టీడీపీ కార్యకర్తలు ఆందోళనలతో స్వాగతం పలికారు. ఛార్జిషీటులో పేర్లున్న కళంకిత మంత్రులను తొలగించాలంటూ, సింగరాయకొండలో ఈరోజు సీఎం సభను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉలవపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల చర్యతో ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు ఉలవపాడు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.