: కర్నూలు జడ్పీలో ఇరు పార్టీల సభ్యుల మధ్య కంచె ఏర్పాటు
కర్నూలు జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీ, వైకాపా సభ్యుల మధ్య ఏకంగా కంచెను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఛైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ ఏర్పాటు చేశారు. టీడీపీ వైపు 9 మంది వైకాపా సభ్యులు, ఇద్దరు కాంగ్రెస్, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఎన్నిక నేపథ్యంలో కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.