: గేట్ విద్యార్థుల కోసం... సరికొత్త ట్యాబ్లెట్ వచ్చింది గురూ!
గేట్ ప్రవేశ పరీక్షకు ప్రిపేరయ్యే ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం గేట్ ఫోరం సంస్థ జి-ట్యాబ్ పేరుతో సరికొత్త టాబ్లెట్ ను తీసుకువచ్చింది. 300 గంటల నిడివి ఉన్న లెక్చర్ల వీడియోలతో పాటు 3,500 పేజీల ప్రింట్ కంటెంట్ ను పీడీఎఫ్ ఫార్మాట్ లో అందుబాటులో ఉంచారు. దీంతో పాటే మోడల్ ప్రశ్నాపత్రాలు కూడా ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ జీ-ట్యాబ్ ధర రూ.19,990 మాత్రమే. ఈ కంటెంట్ ను ఏడాది పాటు చదువుకోవచ్చు. తర్వాత ఎంచక్కా ఫార్మాట్ చేసి, సాధారణ ట్యాబ్లెట్ గా వాడుకోవచ్చు.