: జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో తటస్థంగా ఉండండి: టీటీడీపీ నేతలకు బాబు సూచన
తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ రోజు జిల్లాపరిషత్ లకు పరోక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఛైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తటస్థంగా ఉండాలని తమ నేతలకు ఆయన సూచించారు. బాబు సూచనకు టీ నేతలు అంగీకారం తెలిపారు. వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ తో కలసి ముందుకెళ్లాలని టీటీడీపీ నేతలు ఇంతకు ముందు నిర్ణయించిన సంగతి తెలిసిందే.