: టీడీపీ, కాంగ్రెస్ లు చేయి కలిపాయి... నమ్మశక్యం కాకున్నా ఇది నిజం
ఎప్పుడూ ఉప్పు, నిప్పుగా వ్యవహరించే టీడీపీ, కాంగ్రెస్ ల మధ్య సయోధ్య కుదిరింది. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. జిల్లాపరిషత్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇది సంభవమయింది. రంగారెడ్డి జడ్పీ పీఠాన్ని చెరో రెండున్నర ఏళ్లు పాలించేలా ఒప్పందం కుదిరింది. అలాగే, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో టీడీపీకి జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది.