: అందరి కళ్ళూ అతడిపైనే..!
ఫిఫా వరల్డ్ కప్ లో నేడు రెండు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. రాత్రి 9.30కి జరిగే మ్యాచ్ లో అర్జెంటీనా జట్టు బెల్జియంతో తలపడనుంది. రాత్రి 1.30కి జరిగే మ్యాచ్ లో నెదర్లాండ్స్, కోస్టారికా పోటీపడతాయి. కాగా, టోర్నీ జరుగుతోంది బ్రెజిల్లోనే అయినా, అక్కడి ఫ్యాన్స్ అందరూ అర్జెంటీనా స్టార్ లయొనెల్ మెస్సీ అంటే పడిచచ్చిపోతారు. అదే సమయంలో అర్జెంటీనా ఓడిపోవాలని కోరుకుంటారు. నేడు జరగనున్న మ్యాచ్ లో మాత్రం మెస్సీనే మెయిన్ అట్రాక్షన్ గా నిలవనున్నాడు. గ్రూప్ దశ నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న మెస్సీ ఈ కీలక సమరంలోనూ అదే జోరు కొనసాగిస్తే అర్జెంటీనా సెమీస్ చేరడం నల్లేరుపై నడకే.