: సీఎం కేసీఆర్ ను కలిసిన జపాన్ కాన్సులేట్ జనరల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను జపాన్ కాన్సులేట్ జనరల్ నకానో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో కలిసి పనిచేద్దామని, విద్యుత్ ఉత్పత్తిలో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ భేటీ అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఉత్తమమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. విదేశీ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సమగ్ర విధాన రూపకల్పనకు మరో నెల రోజుల సమయం పడుతుందని కేసీఆర్ తెలిపారు.