: మెరుగైన విద్యను అందరికీ అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నాం: మంత్రి గంటా


శనివారం నాడు ఆంధ్రా యూనివర్శిటీలో 13 వర్శిటీల వైస్ ఛాన్సలర్లతో సమావేశం నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విద్యాశాఖాధికారులతో అంచెల వారీగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, మెరుగైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. రేపు జరిగే వీసీల సమావేశం తర్వాత విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పుల గురించి చర్చించేందుకు రిజిస్ట్రార్లు, జిల్లా విద్యాశాఖాధికారులు, ఆర్జేడీలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించనున్నామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News