: వింబుల్డన్ లో 'యువ' హవా
టెన్నిస్ క్రీడలో కొత్త తరం ప్రవేశించింది. రఫెల్ నడాల్, రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రేలు అందరికీ సుపరిచితులే కానీ... గ్రిగోర్ దిమిత్రియెవ్, మిలాస్ రవోనిక్, నిక్ కిర్గియోస్... వీళ్ళ పేర్లు మాత్రం పెద్దగా ప్రచారంలో లేవు. కానీ, తాజాగా వింబుల్డన్ లో వీరిదే హవా. వీరు నమోదు చేసిన సంచలనాలు వీరికి స్టార్ డమ్ కట్టబెట్టాయి. ఆసీస్ కుర్రాడు కిర్గియోస్ వరల్డ్ నెంబర్ వన్ రఫెల్ నడాల్ కు చుక్కలు చూపించగా, దిమిత్రోవ్... బ్రిటన్ ఆశాకిరణం ముర్రేను ఇంటిదారి పట్టించాడు.
ఇక, రవోనిక్ కాస్తా కిర్గియోస్ కు చెక్ పెట్టి ఫెదరర్ తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. మరోవైపు దిమిత్రోవ్ టాప్ సీడ్ జొకోవిచ్ తో సెమీస్ కు సై అంటున్నాడు. ఈ నేపథ్యంలో వింబుల్డన్ ఈసారి కొత్త చాంపియన్ ను అందిస్తే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీలేదు.