: వైవాహిక జీవితానికి మోడీ దూరం కావడానికి కారణం ఇదే: మోడీ సోదరుడు


భారత ప్రధాని నరేంద్ర మోడీకి బలవంతంగానే పెళ్లి చేశామని స్వయానా మోడీ సోదరుడు సోంభాయ్ మోడీ వెల్లడించారు. చిన్న వయసులోనే పెళ్లి చేసే సంప్రదాయం ఉన్న తమ కుటుంబంలో... పిన్న వయసులోనే మోడికి బలవంతంగా జసోదాబెన్ తో పెళ్లి చేశారని, దీనిని జీర్ణించుకోలేకనే మోడీ ఆ తర్వాత వైవాహిక జీవితానికి చరమ గీతం పాడారని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. దేశం కోసం సేవ చేయాలనే స్వామి వివేకానందుడి బోధనలతోనే వైవాహిక జీవితాన్ని మోడీ త్యజించారని ఆయన పేర్కొన్నారు. ఇకపై ఈ విషయాల ఆధారంగానే మోడీ వైవాహిక జీవితాన్ని చూడాలని, అనవసర రాద్దాంతం చేయకండని అభ్యర్థించారు.
2001 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఎన్నికల అఫిడవిట్ లో వివాహానికి సంబంధించిన అంశాన్ని నాలుగు సార్లు వెల్లడించని మోడీ... నిన్నటి సార్వత్రిక ఎన్నికల అఫిడవిట్ లో మాత్రం తనకు వివాహమైందని, అయితే వివాహమైన కొద్ది కాలానికే తన భార్య జసోదాబెన్ తో విడిపోయానని ప్రకటించిన సంగతి తెలిసిందే. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలు ఎక్కువైన నేపథ్యంలో మోడీ తనకు వివాహమైన విషయాన్ని వెల్లడించక తప్పలేదు.

  • Loading...

More Telugu News