: ఆ కౌన్సిలర్ దొరికాడు
కడప జిల్లా జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన టీడీపీ కౌన్సిలర్ ముల్లాజానీ దొరికాడు. ముల్లా జానీని కడప పోలీసులు గోవాలో పట్టుకున్నారు. ముల్లా జానీని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ అతని తల్లి, మరో కౌన్సిలర్ పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, ముల్లా జానీని వైఎస్సార్సీపీ నేతలు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నేతకు చెందిన గోడౌన్ పై దాడికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపు చేసిన విషయం తెలిసిందే.