: రాళ్లు రువ్వుకుంటున్న టీడీపీ, వైఎస్సార్సీపీ
అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ఎంపీపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకుని దాడులకు పాల్పడ్డారు. దీంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఘటనలో ధర్మవరం మండలం బర్తనపల్లిలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.