: మరణానంతరం.. డిజిటల్ జీవితం
మరణం.. మనిషి జీవనయానానికి అనివార్యమైన ఓ ఫుల్ స్టాప్. అయితే, చనిపోయినా జీవించడం సాధ్యమేనంటోంది ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్. మనం చనిపోయిన తర్వాత కూడా, ఆన్ లైన్ లో ఉన్న మన సమాచారాన్ని నియంత్రించి, చక్కదిద్దగల వినూత్న పరిజ్ఞానం రూపకల్పనలో గూగుల్ శ్రమిస్తోంది. దీనిద్వారా మరణానంతరం కూడా మన అకౌంట్ ద్వారా ఈమెయిల్స్ ను సంబంధిత వ్యక్తులకు పంపడం కుదురుతుంది. అందుకు మనం చేయాల్సిందల్లా మన గూగుల్ అకౌంట్ లోని కొన్ని ఆప్షన్లను ఎంచుకోవడమే.
ఒక్కసారి మనం ఈ సదుపాయాన్ని పొందితే ఇక మనకిష్టమైన వ్యక్తులు మన సమాచారాన్ని పొందే వీలుంటుంది. ఎవరైనా మన అకౌంట్ ను దుర్వినియోగ పరుస్తుంటే మనం సూచించిన మొబైల్ నెంబర్లకు హెచ్చరిక సందేశాలు పంపుతుంది. మొత్తమ్మీద 10 మంది వరకు మన సమాచారాన్ని పొందవచ్చట ఈ సరికొత్త పరిజ్ఞానంతో. అంటే ఓ రకంగా ఇది డిజిటల్ వీలునామా అన్నమాట!