: సొసైటీ భూములను తిరిగి ఇవ్వాలని కేసీఆర్ ను కోరతాం: అశోక్ బాబు


ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూముల్లో ఇళ్ల నిర్మాణాలు జరగలేదంటూ వాటిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ ను త్వరలో కలసి భూములను ఏపీఎన్జీవోల సొసైటీకి ఇవ్వాలని కోరతామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. కాగా, తమకు ఇచ్చిన భూముల్లో వంద ఎకరాలు వివాదాల్లో ఉందని, దానిపై జడ్జిమెంట్ న్యాయస్థానంలో రిజర్వులో ఉందనీ అన్నారు. కోర్టు నుంచి తమ సొసైటీకి టైటిల్ క్లియరెన్స్ కూడా రాలేదని తెలిపారు. అందుకే సొసైటీలో ఇంతవరకు నిర్మాణాలు చేపట్టలేదని అశోక్ బాబు వెల్లడించారు. అయితే, భూములపై కోర్టులో ఉన్న ప్రతి కేసులోనూ ప్రభుత్వమే ప్రతివాదిగా ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర దీనికి సంబంధించిన రికార్డు ఉందో లేదో తమకు తెలియదన్నారు. కాగా, ఈ సాయంత్రం రెవెన్యూ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ మీనాను కలసి వివరాలు చెబుతామని చెప్పారు. 2010లో 142 ఎకరాల్లో లేవుట్ కోసం రూ.4 కోట్లు జీహెచ్ఎంసీకి కట్టామని, అదే ఏడాదిలో 1,644 మందికి లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించామని కూడా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News