: షారూఖ్ కీర్తి కిరీటంలో మరో అవార్డు


ఫ్రాన్స్ నుంచి 'నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్' పురస్కారం అందుకున్న బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మూడ్రోజులు తిరగకుండానే తన కీర్తి కిరీటంలో మరో అవార్డును పొదుగుకున్నారు. 'ఎంటర్ టైనర్ ఆఫ్ ఇండియన్ సినిమా' అనే అవార్డును షారూఖ్ ఖాన్ కు అందజేయనున్నట్టు విజయ్ అవార్డ్స్ సంస్థ వెల్లడించింది. విజయ్ అవార్డ్స్ 8వ వార్షికోత్సవాల్లో భాగంగా తొలిసారిగా ఎంటర్ టైనర్ అవార్డు ప్రవేశపెట్టారు.
ఈ మేరకు తొలి అవార్డును కింగ్ ఖాన్ కు అందజేస్తున్నట్టు ఎంపిక కమిటీ సభ్యుడు వెల్లడించారు. గతేడాది 'చెవలియార్ శివాజీ గణేషన్' అవార్డును షారూఖ్ ఖాన్ గెలుచుకున్నారు. ఆ అవార్డుకు ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.శంకర్ ఎంపికయ్యారు.

  • Loading...

More Telugu News