: వాయవ్య, మధ్య భారతంలో దారుణ కరవుకు ఛాన్స్: స్కైమెట్


వర్షాలు లేక అల్లాడుతున్న దేశంలో కొన్ని ప్రాంతాల్లో దారుణ కరవుకు అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సూచన ఏజెన్సీ స్కైమెట్ ముందుగా హెచ్చరిస్తోంది. ఈ మేరకు భారతదేశంలోని వాయవ్య ప్రాంతంలో 80 శాతం, మధ్య భారతంలో 75 శాతం కరవు వచ్చే సూచనలున్నాయని అంచనా వేసింది. అంతేగాక భూమిపై ఎల్ నినో ప్రభావం మరింత పెరగనుందని పేర్కొంది. జూన్ లో భారత్ లో 42 శాతం వర్షపాతం నమోదైతే, స్కైమెట్ లెక్కల ప్రకారం గత 113 సంవత్సరాలలో ఇలాంటి తక్కువ వర్షపాతాన్ని దేశం పన్నెండుసార్లు చూసిందని వివరించింది. అంటే ప్రతి పదేళ్ల కొకసారి దేశం అత్యంత లోటు వర్షపాతాన్ని చూస్తోందని వెల్లడించింది. ఇక నైరుతి రుతుపవనాలకు వెళితే, జూన్ లో చాలా బలహీనంగా వర్షపాతం ఉందన్నది. కేవలం కేరళ, తమిళనాడు, దక్షిణ కర్ణాటక ప్రాంతంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపింది. ఇక రుతుపవనాల మొదటి నెలలో గోవా, మహారాష్ట్రలో చాలా తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపింది.

  • Loading...

More Telugu News