: అక్రమ నిల్వల వల్లే ఉల్లి ధరల పెరుగుదల: అరుణ్ జైట్లీ
దేశంలో ఉల్లిపాయల ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. కొంతమంది ఉల్లిని అక్రమంగా దాచడం వల్లే ఈ ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. అక్రమ నిల్వలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే ఇలా జరగదన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్రమ నిల్వదారులపై చర్యలు తీసుకోవాలని, అందుకు కేంద్రం మద్దతు పూర్తిగా ఉంటుందని వెల్లడించారు. అయితే, గతేడాదితో పోలిస్తే ఉల్లి ధర ప్రస్తుతం కాస్త తక్కువగానే ఉందని, కాబట్టి భయాందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రతియేటా జులై నుంచి డిసెంబర్ మధ్య కొన్ని కూరగాయలు, ఇతర ఆహార ధరలు పెరగడం సాధారణం అయిపోయిందన్నారు.