: 'ప్రాక్టీసు' అలవోకగా..!


టీమిండియాకు ఇంగ్లండ్ పర్యటనలో శుభారంభం లభించింది. డెర్బీషైర్ జట్టుతో ప్రాక్టీసు మ్యాచ్ ను భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆటకు చివరిరోజు డెర్బీషైర్ విసిరిన 141 పరుగుల విజయలక్ష్యాన్ని ధోనీ సేన 36.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత జట్టులో విజయ్ 41, రహానే 39, గంభీర్ 21 (నాటౌట్) పరుగులతో రాణించారు. అంతకుముందు డెర్బీషైర్ తన రెండో ఇన్నింగ్స్ ను 3 వికెట్లకు 156 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో డెర్బీషైర్ 326/5, భారత్ 341/6 స్కోర్ల వద్ద డిక్లేర్ చేశాయి.

  • Loading...

More Telugu News