: వైద్య ఆరోగ్య శాఖపై చంద్రబాబు సమీక్ష
వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. శిశు మరణాలను తగ్గించేందుకు వీలుగా అన్ని ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన చెప్పారు.