: సిద్దూను శాంతింపజేసేందుకు బీజేపీ యత్నం


మాజీ క్రికెటర్, అమృత్ సర్ ఎంపీ నవజ్యోత్ సిద్ధూ భార్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తన భర్తను బీజేపీ దూరంగా పెట్టిందని, అందుకే టీవీ షోలను ఒప్పుకుంటున్నారని, వచ్చే లోకసభ ఎన్నికలలో ఆయన పోటీ చేయకపోవచ్చంటూ ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సిద్ధూతో ఈ ఉదయం ఫొన్లో మాట్టాడినట్లు సమాచారం. సిద్దూ అభ్యంతరాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే పార్టీ కార్యదర్శి జె.పి.నడ్డాను సిద్దూతో మాట్లాడాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ సమస్య సామరస్యంగా పరిష్కారమవుతుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. సిద్ధూ ఐపిఎల్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే రాజ్ నాథ్ తో సమావేశమవుతారని తెలిపాయి.

  • Loading...

More Telugu News