: ఇది రిక్షావాలా లక్ష్యం


'రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు' అని సినీ కవి రిక్షా కార్మికుడి కష్టాన్ని చెప్పాడు. అలాంటి రిక్షా కనుమరుగైపోతోంది. రిక్షా కార్మికులు పనిలేక భిక్షగాళ్లుగా మారిపోతున్నారు. కష్టాన్ని నమ్ముకునే ప్రతి రిక్షా కార్మికుడు రిక్షాలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ పొట్టపోసుకునేవాడు. అలాంటి రిక్షావాలాలను బతికించండి అనే సందేశంతో కోల్ కతా కు చెందిన రిక్షా వాలా సత్యేన్ దాస్ (40) దేశ వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. రిక్షాలో తన సామగ్రి, తన అవసరాలకు సరిపడా మొత్తాన్ని స్థానికుల నుంచి సేకరించి మూడు వేల కిలో మీటర్లు చుట్టి వచ్చేందుకు గత నెలలో కోల్ కతా నుంచి బయల్దేరాడు. రిక్షా అత్యంత చౌకైన రవాణా సాధనమని, ప్రమాదాలు చోటు చేసుకోవని, ప్రతి పట్టణంలో చెబుతున్నాడు. ప్రస్తుతానికి యూపీ చేరుకున్న దాస్ శ్రీనగర్ మీదుగా కార్గిల్ కు వచ్చే నెల చేరుకునే అవకాశం ఉంది. దీని ద్వారా గిన్నిస్ బుక్ లో అతని పేరు శాశ్వతంగా లిఖించుకునే అవకాశం కూడా ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News