: మూడు గంటల పాటు నిలిచిపోయిన బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ లావాదేవీలు
ముంబయిలోని స్టాక్ మార్కెట్ లావాదేవీలు ఇవాళ మూడు గంటల పాటు నిలిచిపోయాయి. నెట్ వర్క్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో బీఎస్ఈ ట్రేడింగ్ ఉదయం 9.21 గంటలకు అంటే... ట్రేడింగ్ మొదలైన ఆరు నిమిషాలకే ఆగిపోయింది. మరమ్మత్తుల అనంతరం దాదాపు మూడు గంటల తర్వాత లావాదేవీలను తిరిగి ప్రారంభించారు. ఇలాంటి సమస్య తలెత్తడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి.