: దేశంలోనే గొప్ప నగరంగా కరీంనగర్ ను తీర్చిదిద్దుతాం: ఎంపీ వినోద్


దేశంలోనే గొప్ప నగరంగా కరీంనగర్ ను తీర్చిదిద్దుతామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని చెప్పారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు వెళుతోందని అన్నారు. కరీంనగర్ మేయర్ గా రవీందర్ సింగ్ గెలుపొందిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం రవీందర్ సింగ్ మాట్లాడుతూ, పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని చెప్పారు. ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.

  • Loading...

More Telugu News