: ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారుగా పరకాల ప్రభాకర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సలహాదారుగా పరకాల ప్రభాకర్ నియమితులైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు కేబినెట్ హోదా కల్పించి, సమాచార సలహాదారుగా నియమించినట్టు సమాచారం. దీనికి సంబంధించి రేపు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. గతంలో పరకాల బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. ప్రస్తుతం కేంద్రంలో వాణిజ్య శాఖ మంత్రిగా పని చేస్తున్న నిర్మలా సీతారామన్ ఆయన సతీమణి.