: ధర్మల్ ప్రాజెక్టుకు నేను వ్యతిరేకం కాదు : కేంద్రమంత్రి కృపారాణి
శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టుపై కేంద్రమంత్రి కిల్లి కృపారాణి స్పందించారు. ధర్మల్ ప్రాజెక్టుకు తాను వ్యతిరేకం కాదని తెలిపారు. అయితే, సోంపేటలో థర్మల్ ప్రాజెక్టు కోసం సేకరించిన స్థలం సరైనది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. జిల్లాలోని ఆముదాలవలసలో రూ.2కోట్లతో చేపడుతున్న తపాలా కార్యాలయ భవన నిర్మాణానికి కృపారాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.