: టీడీపీతో చేయికలిపిన ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు... పరిస్థితి ఉద్రిక్తం
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రోజు జరుగుతున్న మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా, ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు టీడీపీ శిబిరంలో చేరిపోయారు. దీంతో, వైకాపా నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.