: బలవంతంగా లాక్కెళ్లి పొలాల్లో అఘాయిత్యం చేశారు


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. యూపీలో మహిళలు కాలు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా షామ్లి జిల్లా రసూల్ పూర్ గ్రామంలో మార్కెట్ కు వెళ్తున్న 16 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన కర్బన్, వసీమ్ అనే ఇద్దరు కామాంధులు బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాగోలా ఇల్లు చేరిన బాలిక, జరిగిన దురాగతాన్ని తండ్రికి వివరించింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న కర్బన్, వసీమ్ కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News