: వరకట్న కేసు కింద ఎవర్నైనా సరే అరెస్టు చేస్తారా?: సుప్రీం


మహిళలు వరకట్న వ్యతిరేక చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భర్త తరఫు బంధువులను వేధించడానికి ఈ చట్టాన్ని వాడుకుంటున్నారని పేర్కొంది. మహిళలు వరకట్న కేసు దాఖలు చేయగానే, పోలీసులు యాంత్రికంగా వెళ్ళి అరెస్టులు చేస్తున్నారని సుప్రీం విమర్శించింది. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా అరెస్టులు తగదని సూచించింది. ఇలాంటి కేసుల్లో చాలా తక్కువ సందర్భాల్లోనే నేరం రుజువు అవుతోందని జస్టిస్ సీకే ప్రసాద్, పీసీ ఘోష్ లతో కూడిన ద్విసభ్య బెంచ్ విచారం వ్యక్తం చేసింది.

ఐపీసీ 498ఏ చట్టం కింద కేసు నమోదు చేసుకున్నప్పుడు, అన్ని విధాలా విచారించి, ప్రమాణాలను అనుసరించి అరెస్టులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులను ఆదేశించాలని సుప్రీం పేర్కొంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్41 ప్రకారం 9 పాయింట్ల చెక్ లిస్టు ఆధారంగానే అరెస్టు నిర్ణయాలు తీసుకోవాలని వివరించింది.

  • Loading...

More Telugu News