: జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ


గాంధీ ఆస్పత్రిలో గత మూడు రోజులుగా తాము చేస్తున్న సమ్మెను జూనియర్ డాక్టర్లు విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందే తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో జూనియర్ డాక్టర్లు చర్చలు జరిపారు. చర్చలు ముగిసిన అనంతరం జూడాల సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ... తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం త్వరగా స్పందించిందని చెప్పారు. వైద్య శాఖ మంత్రి రాజయ్య, హోం మంత్రి నాయిని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News