: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కృష్ణా వాటర్ బోర్డు లేఖ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్ర జలవనరుల కార్యదర్శి, కృష్ణా నదీ జలాల నిర్వహణ మండలి (కేఆర్ఎంబీ) ఛైర్మన్ ఏబీ పాండ్య లేఖ రాశారు. ఈ నెల 8, 9 తేదీల్లో మండలి సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులను పంపాలని సూచించారు. ఆ లోపు ఇరు ప్రభుత్వాలు మండలి సభ్యులను నియమించుకోవాలని చెప్పారు. వచ్చే మండలి సమావేశంలో నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారు.