: బాబు తొలి శ్వేత పత్రం విడుదల
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి శ్వేత పత్రం విద్యుత్ రంగంపై విడుదల చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ విద్యుత్ వ్యవస్థను భ్రష్టుపట్టించిందని మండిపడ్డారు. పురోగమనంలో ఉన్న విద్యుత్ రంగాన్ని తిరోగమనం పట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని నిప్పులు చెరిగారు. జెన్ కోను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పాదకత పెంచి, మిగులు విద్యుత్ ను రాష్ట్రానికి ఇస్తే, దానిని కూడా సరిగా వినియోగించుకోకుండా ఉత్పాదకత పడిపోయేలా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన దుయ్యబట్టారు. దీనికి తోడు రాష్ట్ర విభజన విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన తెలిపారు.