: క్యాన్సర్ నుంచి కోలుకున్న యువీ తండ్రి
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ పేసర్ యోగ్ రాజ్ సింగ్ (57) క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. అమెరికాలోని మిసిసిపి నుంచి ఆయనే స్వయంగా ఫోన్ లో మీడియాకు ఈ విషయం తెలిపారు. కొన్ని నెలల క్రితం ఆయన స్వరపేటిక క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు గుర్తించారు. అనంతరం శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్ళారు. ఈ క్రమంలో సర్జరీ విజయవంతం కావడంతో యోగ్ రాజ్ క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. రేపు ఉదయం ఆయన భారత్ చేరుకుంటారు. తాను కోలుకున్నానని, అయితే, ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని చెప్పారు.
కాగా, యువరాజ్ తల్లి షబ్నం నుంచి విడాకులు తీసుకున్న తర్వాత యోగ్ రాజ్ సింగ్... సత్వీర్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. వారికి విక్టర్, అమేయ అనే పిల్లలున్నారు. యువరాజ్ కు జొరావర్ సింగ్ అనే సోదరుడు ఉన్నాడు.