: నిబంధనల మేరకే ఛైర్మన్ ఎన్నిక జరిగింది: హరీష్ రావు
నియమ నిబంధనల ప్రకారమే తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక జరిగిందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని జూన్ 29వ తేదీన సభ్యులకు పంపినట్లు ఆయన చెప్పారు. బ్యాలెట్ ప్రకారం ఎన్నిక జరుగుతుందని స్పష్టంగా పేర్కొన్నారని ఆయన అన్నారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఛైర్మన్ పదవిని అలంకరించినందుకు సంతోషించాలని ఆయన హితవు పలికారు. మండలి ప్రొసీజరును కూడా కొందరు వక్రీకరించేందుకు ప్రయత్నం చేశారని హరీష్ రావు ఆరోపించారు.