: ఆ ముఖ్యమంత్రి ఇప్పటికీ పిన్ని నుంచే పాకెట్ మనీ తీసుకుంటాడు!


ముఖ్యమంత్రి అంటే ఆ హోదాయే వేరు! అడుగేస్తే అధికారదర్పం ప్రస్ఫుటమవుతుంది... కోరినవన్నీ నిమిషాల్లో ప్రత్యక్షమవుతాయి. అలాంటిది ఓ సీఎం ఇంకా పాకెట్ మనీ తీసుకుంటాడంటే, అదీ ఆయన పిన్ని నుంచి అంటే ఆసక్తి కలిగించే అంశమే. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ (41)కు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. ములాయం తమ్ముడు శివ్ పాల్ యాదవ్, ఆయన భార్య అన్నీ తామై, సొంత బిడ్డకన్నా మిన్నగా అఖిలేశ్ ను సాకారు. అఖిలేశ్ కూడా పిన్నినే తల్లిలా భావించడంతో వారిద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుపోయింది.

చిన్నప్పటినుంచి అఖిలేశ్ కు ఖర్చుల కోసమని పాకెట్ మనీ ఇవ్వడం ఆమెకు అలవాటు. అఖిలేశ్ ఇటావాలోని సెయింట్ మేరీస్ స్కూల్ నుంచి సిడ్నీ యూనివర్శిటీ వరకు విద్యాప్రస్థానం సాగించడం, ఆనక రాజకీయాల్లోకి రావడం జరిగిపోయాయి. అటుపై ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయినా, నేటికీ పిన్నితో పాకెట్ మనీ ఇప్పించుకుంటారు. నిజంగా ఆశ్చర్యమే కదూ!

  • Loading...

More Telugu News