: జూడాలు చర్చలకు రావాలని కోరిన టీ డిప్యూటీ సీఎం


హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో విధులను బహిష్కరించి మూడో రోజుల నుంచి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని చర్చలకు రావాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వైద్యశాఖ మంత్రి రాజయ్య ఆహ్వానించారు. వారి సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకు అధికారులను పంపినట్టు తెలిపారు. మానవతా దృక్పథంతో డాక్టర్లు తమ సేవలను అందించాలని కోరారు. కొన్ని రోజుల కిందట ఓ రోగి బంధువులు ఆగ్రహంతో డాక్టర్లపై దాడికి దిగడంతో జూడాలు ఆందోళన చేపట్టారు.

  • Loading...

More Telugu News