: బీచ్ లలో బికినీలు, మినీ స్కర్టులు నిషేధించలేం: గోవా మంత్రి
బీచ్ లలో బికినీలు, మినీ స్కర్టులు ధరించకుండా నిషేధం విధించలేమని మంత్రి దిలీప్ పారులేకర్ స్పష్టం చేశారు. గోవా రాజధాని పనాజీలో ఆయన మాట్లాడుతూ, మహిళల వస్త్రధారణపై నియంత్రణ పెట్టడం సాధ్యం కాదని అన్నారు. నిన్న గోవా ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ ధావలికర్ మాట్లాడుతూ, బీచ్ లలో బికినీలు, మినీ స్కర్టులు నిషేధిస్తే కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగవని అన్నారు.
ఆయన వ్యాఖ్యలపై గోవాలో నిరసనలు రేగాయి. దీంతో ధావలికర్ ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఉచిత సలహాలు ఇచ్చే బదులు నీటి సమస్యపై దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దుర్గాదాస్ కామత్ అభిప్రాయపడ్డారు.