: చెన్నైలో భవనం కూలిన ఘటనలో 47కి చేరిన మృతుల సంఖ్య
చెన్నైలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 47కి చేరింది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు 13 మంది ఉన్నారు. తమిళనాడుకి చెందిన 9 మంది, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఉన్నారు. గుర్తు తెలియని వారు మరో 19 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 27 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.