: ఇన్ఫోసిస్ లాభాలలో స్వల్ప పెరుగుదల


జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలలో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. ఆదాయాలు 18.09శాతం పెరిగి 10454 కోట్లకు, నికర లాభాలు 3.3శాతం పెరిగి 2394 కోట్లకు చేరాయి. 2012-13 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయాలు 19.6శాతం పెరిగి 40352కోట్లకు, నికర లాభాలు 13.3శాతం పెరిగి 9421 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయాలు 6 నుంచి 10 శాతం పెరగగలవని కంపెనీ అంచనా వేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి ఐటి రంగానికి సవాలేనని ఇన్ఫోసిస్ సీఈఓ శిబూలాల్ అన్నారు.

  • Loading...

More Telugu News