: నడాల్ ఓటమి... ఆస్ట్రేలియాలో సంబరాలు


భీకరమైన ఫామ్ లో ఉన్న స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ వింబుల్డన్ గ్రాస్ కోర్టు టోర్నీలో ఓటమి చవిచూడడంపై ఆస్ట్రేలియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే, నడాల్ ను 'గడ్డి' కరిపించిన పంతొమ్మిదేళ్ళ కుర్రాడు నిక్ కిర్గియోస్ ఆస్ట్రేలియనే. దీంతో, ఇక్కడ ప్రజల్లో ఆనందోత్సాలు పెల్లుబికాయి. కొందరు టెన్నిస్ అభిమానులు రేడియో స్టేషన్లకు ఫోన్ చేసి కిర్గియోస్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని, పర్వతాలకు పట్టణాలకు పునఃనామకరణం చేయాలని, కొత్తగా ఓ జాతీయ వంటకాన్ని ప్రకటించి, దానికి అతని పేరు పెట్టాలని డిమాండ్లు చేస్తున్నారు. అంతలా అలరించింది వారిని కిర్గియోస్ వింబుల్డన్ ప్రదర్శన.

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా టోర్నీలో ప్రవేశించి వరల్డ్ నెంబర్ వన్ ను చిత్తు చేయడం మామూలు మాటలు కాదుకదా! ఈ ప్రీక్వార్టర్స్ మ్యాచ్ లో కిర్గియోస్ 7-6 (7-5), 5-7, 7-6 (7-5), 6-3తో నడాల్ ఆశలపై నీళ్ళు చల్లాడు. కిర్గియోస్ అపూర్వ ప్రదర్శనకు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ కూడా ముగ్ధుడయ్యారు. "ఏం గెలుపు!, ఎంతటి అద్భుతమైన దృక్పథం!" అంటూ ట్విట్టర్లో ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News